Janasena : మరో జనసేన నేత సస్పెన్షన్
జనసేన పార్టీ నుంచి కోట వినుతపై నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
జనసేన పార్టీ నుంచి కోట వినుతపై నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీకాళహస్తి ఇన్ చార్జ్ గా ఉన్న కోట వినుత వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని, పార్టీ నిబంధనలను తొంగలో తొక్కి ప్రవర్తిస్తున్నారని, అందుకే కోట వినుత పై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుందని జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
శ్రీకాళహస్తి ఇన్ చార్జ్ గా...
వినుత వ్యవహారశైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉన్నందున సస్పెన్షన్ చేసినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నుంచే అనేక ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నామని, పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరిపైనేనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.