కోనసీమను ముంచెత్తిన వరద
కోనసీమ జిల్లాను వరద ముంచెత్తింది. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి.
కోనసీమ జిల్లాను వరద ముంచెత్తింది. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‍వే పైకి వరద నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కోనసీమ-పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు సార్లు కాజ్ వేలు నీట మునిగాయి.
తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు బంద్
అప్పనపల్లి కాజ్‍వే పైకి వరద నీరు చేరడంతో గంటిపెదపూడి దగ్గర గోదావరి తాత్కాలిక గట్టు తెగింది. నెల రోజులుగా జలదిగ్భంధంలోనే నాలుగు గ్రామాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పడవల పైనే నాలుగు గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. తమను రక్షించాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.