Andhra Pradesh : క్రమశిక్షణ కమిటీ ఎదుటకు నేడు కావలి ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుటకు నేడు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యే అవకాశముంది

Update: 2025-11-04 07:02 GMT

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుటకు నేడు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యే అవకాశముంది. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో పాటు అక్కడ టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి నష్టం కలిగించాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావ్య కృష్ణారెడ్డిని ఫోన్ లోనే హెచ్చరించినట్లు సమాచారం.

కావ్య కృష్ణారెడ్డికి సమాచారం...
అయితే ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సమాచారం అందించారట. ఈరోజు కొలికపూడి, కేశినేని విచారణ పూర్తయిన తర్వాత కావ్య కృష్ణారెడ్డిని కూడా విచారించే అవకాశాలున్నాయి. అయితే ఆలస్యమయితే రేపు కావ్య కృష్ణారెడ్డిని కమిటీ ఎదుటకు రావాలని చెప్పనున్నారు.


Tags:    

Similar News