Pawan Kalyan : నేడు చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు
janasena chief pawan kalyan will go to tdp chief chandrababu's house today.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. మంగళగిరిలో ఉన్న పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి నేడు వెళ్లనున్నారు. అక్కడ అల్పాహారం ముగించుకున్న అనంతరం ఇద్దరు కలసి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశం అవనున్నారు.
సీఈసీని కలసి..
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలసి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాజకీయ పార్టీలతో భేటీ కానున్న నేపథ్యంలో ముందుగానే వీరిద్దరూ కలసి ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.