ఇంటికి లక్ష.. పవన్ పరిహారం

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన కుటంబాలు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు

Update: 2022-11-08 06:47 GMT

pawan ippatam tour

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన కుటంబాలు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇళ్లు దెబ్బతినడంతో వారికి పార్టీ తరుపున లక్ష రూపాయలు పవన్ ఇవ్వనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ వంతుగా వారు తిరిగి ఇళ్లను నిర్మించుకునేందుకు ఈ సాయం అందచేస్తున్నట్లు వారు తెలిపారు.

బాధితులను పరామర్శించి...
ఇప్పటం గ్రామంలో ఇటీవల పర్యటించిన పవన్ కల్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించారు. ఇప్పటం గ్రామంలో కొందరు రైతుల జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారన్న కక్ష కట్టి ప్రభుత్వం కూల్చివేతకు పాల్పడిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారికి అండగా నిలబడాలని నిర్ణయించారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు.


Tags:    

Similar News