Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం ఏర్పాటయి నేటికి ఏడాది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయింది.

Update: 2025-06-12 01:35 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయింది. నేటికి అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో అధికారికంగా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఏడాది నుంచి చేస్తున్న మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

సుపరిపాలన, సంక్షేమంతో పాటు...
సుపరిపాలన, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో ఏడాది లో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో పాటు అధికారులు కూడా పాల్గొని సభలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు.


Tags:    

Similar News