Andhra Pradesh : కొత్త ఏడాది తొలి రోజే పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఏడాది రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఏడాది రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమలులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ విలువలు పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశముంది. శాస్త్రీయంగా విలువలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలను కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం...
అయితే జిల్లా కలెక్టర్లు ఈ మేరకు విలువలను నిర్ణయించి దానిని ప్రజల అభ్యంతరాల కోసం ఉంచుతారు. ఈ నెల 24వ తేదీ వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని 27వ తేదీన పరిశీలిస్తారు. అనంతరం కొత్త విలువలను కొత్త ఏడాది జనవరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ విలువల్లో ఉన్న అసమానతలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.