తిరుపతి జిల్లాలో భారీప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్లో పేలుడు

పేలుడు జరిగింది రాత్రి సమయంలో కావడం, అందునా సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది.

Update: 2023-02-11 12:03 GMT

 pipeline blast in tirupati district

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. పైప్ లైన్ నిర్మిస్తున్న క్రమంలోనే పేలుడు జరిగింది. దాంతో 35 అడుగుల మేర పైకి రాళ్లు, మట్టి పైకి లేచాయి. పెద్దశబ్దంతో పేలుడు సంభవించగా.. 5 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది.

పేలుడు జరిగింది రాత్రి సమయంలో కావడం, అందునా సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది. పేలుడుకి సమీపంలో ఉన్న డాబాలో మాత్రం కొందరు భయంతో బయటికి పరుగులు తీశారు. ఏడాది కాలంగా జాతీయ రహదారి సమీపంలోని ఉజిలి వద్ద మేనకూరు పరిశ్రమ వాడ సమీపంలో ఓ సంస్థ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. కానీ.. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News