కొత్త వైరస్ కలవరం

తెలుగు రాష్ట్రాలను H3N2 కలవరానికి గురి చేస్తుంది. ఎక్కువమంది జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు

Update: 2023-03-11 02:27 GMT

తెలుగు రాష్ట్రాలను H3N2 కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికే భారత్ లో ఈ వైరస్ కారణంగా తొలి మరణం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలని, శానిటైజర్ లను వినియోగించాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎక్కువగా జర్వం, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు ఆసుపత్రులు కూడా ఈ కేసులతో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

విశాఖలో...
ప్రధానంగా విశాఖలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం ఈ వైరస్ ను 90 మంది రోగుల్లో గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. H3N2 వైరస్ సోకితే దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వాంతులు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News