Ys Jagan : రాష్ట్రంలో పోలీసు రాజ్యం.. వాళ్లే కమీషన్లు వస్తూలు చేస్తూ పెదబాబు, చినబాబుకు ఇస్తన్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2025-07-16 06:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మీడియా సమావేశంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జగన్ అన్నారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా వైసీపీ ముందుంటుందని జగన్ అన్నారు. సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాల ప్రజలకు మద్దతుగా నిలిచిందని జగన్ అన్నారు. విద్యార్థులు చదువులు ఆపేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ఇది ఆందోళనకరమైన విషయమని జగన్ అభిప్రాయపడ్డారు.

తట్టుకోలేని చంద్రబాబు...
ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుకు తమ సమస్యలను చెప్పుకుని వృధా అని నిర్ణయానికి వచ్చి తమను కలసి సమస్యలను విన్నవించుకుంటున్నారని జగన్ అన్నారు. ఇది తట్టుకోలేని చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. గతంలో తమ ప్రభుత్వం పోలీసులు అత్యుత్తమ పనితీరును కనపరిస్తే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిరుద్యోగ భృతి ఏమయిందని జగన్ ప్రశ్నించారు. జులై నెల చివరి నుంచి చంద్రబాబు హామీల అమలు మోసాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళతామని తెలిపారు. బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమంతో ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీని నిలదీస్తున్నామని జగన్ అన్నారు. ఉన్నతస్థాయి పోలీసు అధికారులపై కూడా తప్పుడు కేసులు నమోదు చేశారని, చాలా మందికి పోస్టింగ్ లు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.
లంచాలు వసూలు చేసేది...
రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని జగన్ అన్నారు. రాష్ట్రంలో డీఐజీ మాఫియా డాన్ అని జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. డీఐజీ స్థాయిలో అవినీతి సొమ్మును కలెక్ట్ చేస్తూ ఎమ్మెల్యేలకు, పెదబాబు, చినబాబుకు కూడా ఇస్తున్నారని అన్నారు. మరో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఉండదని తెలిసి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేదుకు తమను కలుస్తున్నారని అన్నారు. ఇసుక, మద్యం వంటి వాటిల్లో కమీషన్లు దండుకోవడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారని అన్నారు. నేరాల చేసేది.. లంచాలు వసూలు చేసేది పోలీసులేనంటూ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెప్పిన మాట వినని అధికారులపై కేసులు పెడుతున్నారని, ప్రశ్నించిన వారిని కూడా వదలకుండా వేధిస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. తన మోచేతి కింద నీళ్లు తాగే వారిని పోలీసు అధికారులుగా చంద్రబాబు నియమించుకున్నారని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News