Ys Jagan : ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొన్న జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి కావడంతో్ నిన్ననే పులివెందులకు చేరకున్న జగన్ కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో కలసి...
ఉదయం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులు వైఎస్ భారతి, విజయమ్మ, పార్టీ నేతలతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకున్నారు. పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం తర్వాత జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. తన తల్లి విజయమ్మను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.