ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అది ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని చెప్పింది.
లోతట్టు ప్రాంతాలు...
దీంతో ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్, ఎండి తెలిపార. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు ఎవరూ వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని తెలిపారు.