Ramcharan : "పెద్ది" బ్యాట్ తోనే అన్ని రికార్డులను బద్దలు కొట్టనున్నాడా?
రామ్ చరణ్ పెద్ది సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
రామ్ చరణ్ పెద్ది సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. గేమ్ ఛేంజర్ నిరాశపర్చినా పెద్ది మాత్రం బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు. అందులో క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు చేతిలో పడటంతో కథతో పాటు ఇందులో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయంటున్నారు. ఇప్పటికే పెద్ది మూవీకి సంబంధించి ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఒక ఊపు తెచ్చింది. దీంతో పాటు రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ షాట్ కొట్టే ఫొటోలను పెట్టుకుని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ సంబరపడి పోతున్నారు. మిగిలిన సినమాలను, వాటి రికార్డులను తన బ్యాట్ తో బద్దలు కొడతారంటూ మెగా అభిమానులు ఫుల్లు జోష్ లో ఉన్నారు. పెద్దిపై ఏర్పడిన అంచనాలతో దాని విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సిల్వర్ స్క్రీన్ పై ...
రామ్ చరణ్ నటించిన RRR మూవీ అంత రేంజ్ లో పెద్ది మూవీ ఉంటుందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఈ మూవీలో రామచరణ్ కూడా ప్రత్యేకంగా కనిపించనున్నారు. సిల్వర్ స్క్రీన్ ను దడ దడ లాడించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే పెద్ది మూవీపై ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే పెద్ది మూవీ షూటింగ్ కు రామ్ చరణ్ స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. లండన్ తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ నెల చివర నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే తాజా గా రామ్ చరణ్ చెప్పింది ఏంటంటే?
అందరి అంచనాలు...
పెద్ది మూవీ అందరి అంచనాలను రీచ్ అవుతుందని చెప్పారు. ఇప్పటికే ముప్ఫయి శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పిన రామ్ చరణ్ రంగస్థలానికి మించి పెద్ది మూవీ ఉంటుందని చెప్పారు. అంటే రామ్ చరణ్ కూడా కథకు కనెక్ట్ అవ్వడంతో పాటు పెద్ది బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని నమ్ముతున్నారు. బుచ్చిబాబుకు కూడా ఈ మూవీ ఎంత పేరు తెచ్చిపెడితే తన గురువు సుకుమార్ పేరును నిలబెట్టినంత అవుతుందని అంటున్నారు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన బుచ్చిబాబు రామ్ చరణ్ ను తనపాత్రకు ఎంచుకోవడంతోనే సగం హిట్ కొట్టేశారంటున్నారు. ఇక బుచ్చిబాబు పడే కష్టం, శ్రమ కూడా మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు.