మంత్రుల కమిటీతో మళ్లీ చర్చలు మొదలు

మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి

Update: 2022-02-04 13:41 GMT

మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు మంత్రుల కమిటీతో చర్చించేందుకు సచివాలయంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయానికి చేరుకున్నారు.

ప్రభుత్వ ఆహ్వానం మేరకు....
పీఆర్సీ సాధన సమితి కమిటీ సభ్యులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గే అవకాశం కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమే ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పేందుకు సిద్ధమయింది. సమ్మె సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇరు వర్గాలు మరోసారి చర్చకు ఉపక్రమించాయి. అశుతోష్ కమిటీ మిశ్రా కమిటీ నివేదిక మాత్రం బయటపెట్టాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ సమస్యలు చెబితే ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.


Tags:    

Similar News