ద్వారకా తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
భక్తులకు ద్వారకా తిరుమల ఆలయ కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది
భక్తులకు ద్వారకా తిరుమల ఆలయ కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటి నుంచి అంతరాలయ దర్శనం పున:ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఒక్కో భక్తుడికి ఐదు వందల రూపాయల టికెట్‌తో అంతరాలయ దర్శనం లభిస్తుందని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. .
అంతరాలయ దర్శనంపై...
అంతరాలయ దర్శన టికెట్‌పై రెండు చిన్న లడ్డూలు భక్తులకు అందచేస్తామని తెలిపింది. శని, ఆదివారాలు, విశేష పర్వదినాలు మినహా వారంలో మిగతా రోజుల్లో అంతరాలయ దర్శనం ఉంటుందని, భక్తులు అంతరాలయం దర్శనం చేసుకోవాలంటే విధిగా ఐదు వందల రూపాయల టిక్కెట్ ను కొనుగోలు చేయాలని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.