Ys viveka: అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

Update: 2022-02-23 07:09 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని తొలుత చెప్పింది విజయసాయిరెడ్డేనని ఆయన గుర్తు చేశారు. ఈ హత్య కేసులో రోజుకొక కథనాలు వస్తున్నాయని, బాబాయ్ పై గొడ్డలి వేటు చివరకు సీబీఐ అధికారిపై కేసు పెట్టేంత వరకూ వెళ్లిందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

దస్తగిరికి బెదిరింపులు....
ఛార్జిషీట్ లో పేర్కొన్న తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరికి బెదిరింపులు వస్తున్నాయని, ఆయనను ఎవరు బెదిరించాలో సీబీఐ అధికారులు నిగ్గుతేల్చాలని దేవినేని ఉమ డిమాండ్ చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థులు ఎవరో తేల్చాలని దేవినేని ఉమ కోరారు. జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.


Tags:    

Similar News