ఈ నెల 9న కడప జిల్లాకు చంద్రబాబు
ఈ నెల 9వ తేదీన కడప జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు
AP CM Visit Kadapa district
ఈ నెల 9వ తేదీన కడప జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గండికోట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పార్టీ నేతలతో...
కడప జిల్లాకు చంద్రబాబు వస్తుండటంతో పెద్దయెత్తున జనసమీకరణకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. చంద్రబాబు వస్తున్నది కడప జిల్లా కావడంతో అక్కడ బలప్రదర్శన చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. కడప జిల్లాకు వచ్చిన సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో ఆయన సమావేశమై రాజకీయ అంశాలను చర్చించనున్నారు.