Chandrababu : నేడు రెండో రోజు దావోస్ లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండోరోజు దావోస్ లో పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండోరోజు దావోస్ లో పర్యటిస్తున్నారు. నేడు పలు పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు నిర్వహించనున్నారు. ఈరోజు ఐబీఎం, గ్లూగుల్ కౌడ్ వంటి సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సానుకూల అంశాలను వివరించనున్నారు.
వరస భేటీలతో...
నిన్న దావోస్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు బృందం తెలుగు ఎన్ఆర్ఐలతో సమావేశమయింది. అనంతరం కొందరు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చంద్రబాబు వారికి పెట్టుబడులకు గల అవకాశాలతో పాటు ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీల గురించి వివరిస్తన్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు మొత్తం 36 సమావేశాల్లో పాల్గొంటారు.