నారావారిపల్లెల్లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు

Update: 2026-01-14 03:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గోపూజతో సంక్రాంతి సంబరాలను చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలసి నేడు భోగి మంటల వేడుకల్లో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలకు చంద్రబాబు నాయుడు తన సొంత గ్రామమైన నారావారిపల్లె గ్రామానికి వెళతారు.

మూడు రోజుల పాటు..
సంక్రాంతి మూడు రోజుల పాటు ఆయన వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిన్న నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలను నిర్వహించారు. నేడు కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు భోగి మంటలను వేసి వేడుకను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు.


Tags:    

Similar News