జనసేనకు మరో తీపికబురు
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరో గుడ్ న్యూస్ అందించింది.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరో గుడ్ న్యూస్ అందించింది. జనసేన పార్టీని భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలోని కూడా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజుగ్లాసు గుర్తును భారత ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు లేఖ పంపించింది.
వంద శాతం విజయం...
2024 సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజుగ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.