KTR : కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ కేంద్ర మంత్రి

కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ కేంద్ర మంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-01-27 07:57 GMT

కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ కేంద్ర మంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్కకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతే ప్రజలు బాధపడి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా కిషన్ రెడ్డిని గెలిపించారన్నారు. అయితే కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒక్క పని కూడా చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూపాయి నిధులు కూడా కిషన్ రెడ్డి కేటాయించలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈయన మనకు కేంద్రమంత్రిగా ఉండి ఎందుకు దండగ అని అన్నారు. తన్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. మోదీ పాలనలోధరల పెరుగుదల తప్ప మరేమీ లేదన్నారు.

రెండూ ఒక్కటే...
కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని అన్నారు. ఇద్దరూ కలసి తెలంగాణలో డ్రామాలు ఆడుతున్నాయని తెలిపారు. హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపమొస్తుందని తెలిపారు. ఇందుకు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. దేశంలోని పార్టీలన్నీ కూడగట్టి కూటమిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News