తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం

తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు

Update: 2023-10-17 14:15 GMT

తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. వేల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటుంది. మంచినీరు, అన్నప్రసాదాలను అందరికీ అందేలా ఏర్పాట్లు చేసింది.

గరుడ సేవకు...
అయితే ఎల్లుండి గరుడ సేవ. గరుడ సేవకు భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. ఎంత మంది వస్తారో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్లుండి జరిగే గరుడ సేవ సందర్భంగా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 19వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 20వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ ద్విచక్రవాహనాలను కొండమీదకు అనుమతించరు. తిరుమలలో కేవలం 32 పార్కింగ్ ప్రదేశాల్లో పదిహేను వేల వాహనాలు మాత్రమే పడతాయి. మాడ వీధుల్లోనూ లక్ష ఇరవై వేల మంది సామర్థ్యమే ఉంది. గరుడ వాహన సేవకు అంతకు మించి హాజరవుతారని భావించి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలకు అలిపిరి వద్దనే ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News