నేడు పుట్టపర్తికి బీజేపీ చీఫ్ మాధవ్
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేడు పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేడు పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 6:30 నిమిషాల నుండి 7: 30 నిమిషాల వరకు చైతన్య హోటల్ లో సంఘ్ ఆర్ఎస్ఎస్ నేతలతో యోగా కార్యక్రమంలో పాల్గోంటారు. ఉదయం 7:30 నిమిషాల నుండి 8:30 గంటల వరకు మేధావులు, పుర ప్రముఖులు లతో పుట్టపర్తి ఆర్ టి సి బస్ స్టాప్ నందు చాయ్ పే కార్యక్రమంలో మాధవ్ పాల్గొంటారు.
పార్టీ కార్యక్రమాల్లో...
ఉదయం 10గంటలకు పుట్టపర్తి లోని సాయి మా హోటల్ నుండి ఆర్వీజే ఫంక్షన్ హాల్ వరకు ఏర్పాటు చేసిన శోభా యాత్ర కార్యక్రమంలో మాధవ్ పాల్గొంటారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పుట్టపర్తి - RVJ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బిజెపి జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో పాల్గొంటారు