మంచి మనసు చాటుకున్న బాలయ్య

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని

Update: 2025-07-26 11:00 GMT

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని, ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి సాయం అందేలా చేశారు. కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన అభిమాని బద్రిస్వామి కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేని అతని పరిస్థితి గురించి బాలకృష్ణకు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేయించారు. సంబంధిత పత్రాన్ని బాలకృష్ణ భార్య వసుంధర బాధిత కుటుంబానికి అందజేశారు.

Tags:    

Similar News