Andhra Pradesh : వచ్చే నెల స్వచ్ఛాంధ్రలో వేడిని ఎదుర్కోవడం ఎలా?

స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల లో ‘వేడిని ఎదుర్కోవడం ఎలా’ అనే అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు

Update: 2025-04-26 03:02 GMT

ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల లో ‘వేడిని ఎదుర్కోవడం ఎలా’ అనే అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెలలో ఎండ వేడిమి అధికంగా ఉంటుంది.

నీరు మీరుతో పాటు...
వడదెబ్బ మరణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనడంపై స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే నెలలో నీరు-మీరు, జూన్‌లో వేడిని ఎదుర్కోవడం ఎలా? అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే వేడిని తట్టుకోవడంపై కార్యక్రమాన్ని మార్చి నీరు మీరు తో పాటు వేడిని ఎదుర్కొనడం ఎలా? అన్న దానిపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.


Tags:    

Similar News