ఏపీ విద్యార్థులకు షాక్.. సెలవులు పొడిగించేది లేదన్న మంత్రి

ఏపీలో కూడా సెలవుల పొడిగింపు ఉంటుందని అందరూ భావించారు. కానీ.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఊహించని షాకిచ్చారు.

Update: 2022-01-16 11:08 GMT

దేశ వ్యాప్తంగా కోవిడ్, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు జనవరి నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో 9వ తరగతి వరకూ, మరికొన్ని రాష్ట్రాల్లో ప్లస్ 2 వరకూ విద్యార్థులకు నెలాఖరు వరకూ సెలవులు పొడిగించాయి ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా సెలవుల పొడిగింపు ఉంటుందని అందరూ భావించారు. కానీ.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఊహించని షాకిచ్చారు.

ప్రస్తుతానికైతే పాఠశాలల సెలవులు పొడిగించే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంత్రి ప్రకటనతో రేపటి నుంచి విద్యాసంస్థలు యదాతథంగా ప్రారంభం కానున్నాయి. కాగా.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం సమీక్ష సమావేశం జరపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం సెలవులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News