Sat Sep 14 2024 11:12:34 GMT+0000 (Coordinated Universal Time)
వృద్ధుడి ప్రాణం తీసిన అతివేగం
అతివేగం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు మండలం
అతివేగం ప్రమాదకరం.. వాహనాలు నడిపేటపుడు కనీస వేగాన్ని పాటించండి. అని ప్రతిచోటా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డులు దర్శనమిస్తూనే ఉంటాయి. కానీ.. అవేమీ పట్టించుకోకుండా వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉంటారు. అలాంటి నిర్లక్ష్య వాహనదారుల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగిందీ ఘటన.
Also Read : సమంతతో రొమాన్స్ చేయడం ఇష్టం : నాగ చైతన్య
గ్రామానికి చెందిన డేవిడ్ అనే వ్యక్తి తన టూ వీలర్ పై వెళ్తుండగా.. అటువైపుగా అతివేగంతో వచ్చినకారు బైక్ ను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపక్కనే కూర్చున్న వృద్ధుడిపైకి దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన వృద్ధుడు, మరో ఇద్దరిని స్థానికులు సమీపంలో ఉన్న నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజి అనే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Next Story