ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. జీతాలను భారీగా పెంచుతూ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2022-03-22 01:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు జీతాలను భారీగా పెంచాలని నిర్ణయించింది. వీరికి ముప్ఫయి నుంచి యాభై శాతం వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

గిరిజన ప్రాంతాల్లో....
ఇక ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు 30 శాతం మేరకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతాలు ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News