మరోసారి పరీక్షకు అనుమతి

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ అవకాశమివ్వాలని నిర్ణయించింది.

Update: 2022-06-16 12:37 GMT

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలలో 65 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం లభించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పథకాలను కుదించడానికే కావాలని ఉత్తీర్ణతను తగ్గించారని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వం ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ అవకాశం కల్పించింది.

రెండు సబ్జెక్టులకు మాత్రమే....
ఇప్పటి వరకూ ఇంటర్మీడియట్ కు మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు టెన్త్ విద్యార్థులకు కూడా ఆ అవకాశం కల్పించింది. ఏదైనా రెండు సబ్జెక్టుల్లో యాభై మార్కుల కంటే తక్కువగా వచ్చిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రెండు సబ్జెక్టులకు మాత్రమే బెటర్‌మెంట్ కు అవకాశమిస్తారు. ఒక్కొక్క సబ్జెక్టు బెటర్‌మెంట్ పరీక్ష రాయడానికి రూ.500 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.


Tags:    

Similar News