Andhra Pradesh : ఏపీలో మంటల్లో బస్సు
ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్దమయింది.
ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్దమయింది. పార్వతీపురం మన్యం జిల్లా రొడ్డవలస వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి జయపుర వెళుతున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్దమయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులను బస్సు నుంచి దించి వేశారు.
ప్రమాదం సమయంలో...
ప్రమాదం సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఇంజిన్ లో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపేశారు. మంటలు అంటుకోకముందే ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.