మరో రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షం..ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక రాగల రెండు గంటల్లో విజయనగరం,విశాఖ, అల్లూరి,అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్...
ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎవరూ చెట్ల కింద నిలబడరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. విద్యుత్తు స్థంభాల కింద కూడా ఎవరూ నిలబడే ప్రయత్నం చేయవద్దని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.