Nara Loksh : బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు పాట్నా బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు పాట్నా బయలుదేరి వెళ్లనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం పాట్నా కు నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున పాట్నా లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం పాట్నాలో రెండు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు.
పాట్నాలో జరిగే...
సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. సాయంత్రం 7.30 కి బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్ నవంబర్ 9, ఆదివారం ఉదయం 10 గంటలకు పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.