Nara Lokesh : నేడు ఢిల్లీకి నారా లోకేష్
నేడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కానున్నారు
నేడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు తెలపనున్నారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్నిమంత్రి నారా లోకేష్ వివరించనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
రైల్వేప్రాజెక్టులపై...
అశ్వినీ వైష్ణవ్ ను 5.30 గంటలకు కలిసి రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు జరిపినందుకు కృతజ్ఞతలు తెలిపి ప్రాజెక్టులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా సహకరించాలని ఈ సందర్భంగా కోరనున్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు ప్రోత్సాహకాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు ప్రోత్సాహకాలివ్వాలని విజ్ఞప్తిని నారా లోకేష్ చేయనున్నారు.