Nara Lokesh : నేడు ప్రయాగ్ రాజ్ కు లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నారు

Update: 2025-02-17 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు లోకేశ్ వెళ్లనున్నారు. ఉదయం వేళ మహాకుంభాభిషేకంల షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం చేయనున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా ప్రయాగ్ రాజ్ కు లోకేశ్ చేరుకుంటారని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

వారణాసికి...
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసికి లోకేశ్ బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 7.30 గంటలకు తిరిగి విజయవాడ బయలుదేరి రానున్నారని లోకేశ్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 26వ తేదీతో ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగియనుండటంతో లోకేశ్ ప్రయాగ్ రాజ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. లోకేశ్ వీఐపీలు పుణ్యస్నానాలు చేసే ఘాట్ లోనే స్నానమాచరించి వారణాసికి బయలుదేరుతారు.


Tags:    

Similar News