Nara Lokesh : వచ్చే నెలలో అమెరికాకు లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్నారు

Update: 2025-11-25 04:12 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన ఉండనుంది. డిసెంబర్ 6న డల్లాస్ వెళ్లనున్న మంత్రి లోకేశ్ 8 వేల మందితో గార్లాండ్ లో జరగనున్న భారీ సభ లో పాల్గొననున్నారు. 8, 9 తేదీల్లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

నేడు పార్టీ కార్యాలయానికి...
సమావేశంలో ఎన్ఆర్ఐ టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించనున్నాయి. మరొకవైపు నేడు మంత్రి నారా లోకేశ్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా నారా లోకేశ్ ఈ ప్రజాదర్బార్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.


Tags:    

Similar News