శ్రీశైలానికి గవర్నర్ అబ్దుల్ నజీర్
శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు
శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ పర్యటన కొనసాగుతుంది. శ్రీశైలంలో ప్రస్తుతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. భక్తులు ఎక్కువగా వస్తుండటంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు రోజుల పాటు..
అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గ వర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానుండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గవర్నర్ పర్యటనలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోనున్నారు. శ్రీశైలానికి కేవలం ఏపీ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.