Andhra Pradesh : ఏపీ సర్కార్ నిర్ణయంతో వారి ఉద్యోగాలు పోయినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2025-01-26 11:55 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయ ఉద్యోగులను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జానాభా ప్రాతిపదికన ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు కేటగిరీలుగా సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్ఫిరేనల్ ఫంక్షనీర్లగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. సర్ణాంధ్ర విజన్ లో భాగంగా ఏపీ ప్రభతు్వం ఈ నిర్క్ష్నం తీసుకుంది.

సచివాలయాలుగా విభజించి...
సచివాలయాను కూడా మూడు కేటగిరీలుగా విభజించింది. రెండున్నర వేల లోపు జనాభా ఉన్న సచివాలయాన్ని "ఎ" కేటగిరీ గా చేసింది. ఈ కేటగిరీ సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులుంటారు. మూడున్నర వేల లోపు జనాభవ ఉన్న సచివాలయన్ని"బి" కేటిగిరీగా, అందులో ఏడుగురు ఉద్యోగులకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడున్నరవేకు పైగా ఉన్నజనాభా ఉన్న సచివాలయాలను "సీ" కేటగిరీగా విబజజించి అందులో ఎనిమిది మంది ఉద్యోగులు ఉండాలని నిర్ణయించింది. అయితే దీనిపై తమకు పూర్తిస్థాయిలోక్లారిటీ ఇవ్వాలని, తమకు అన్యాయం చేయవద్దని వారు కోరుతున్నారు.


Tags:    

Similar News