Andhra Pradsh : ఏపీ రైతులకు భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రైతులకు భారీ ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు. రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం మరియు ముగింపు ఉండనుంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా ముందస్తు నోటీసులు ఇవ్వనున్నారు. గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన చేయనున్నారు. రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ఆర్.ఓ.ఆర్ ఖరారు చేయనున్నారు.
భూముల రీసర్వేలో...
Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ చేయనున్నారు. మొత్తం రీ-సర్వే కాలం 223 రోజులు ఉండనుంది. వెబ్ ల్యాండ్ 1.0లో కొత్త డిజిటల్ మార్పులు చేసింది. భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకంగా ఉండనున్నాయి. రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గనున్నాయి. తద్వారా రైతులకు భూముల సర్వేలో భారీ ఊరట దక్కేలా ఈ నిర్ణయం ఉంది.