ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,06,943 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,677 మంది మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,38,226 గా ఉంది. 54,,040 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,27,05,524 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 440 కేసులు నమోదయ్యాయి.