Ys Jagan : సుజలధారను ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ys jagan in andhra pradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పలాసలోని వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఈరోజు జగన్ ప్రజలకు అంకితం చేశారు. దీనివల్ల ఉద్దానం ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు లభ్యమవుతుంది. తద్వారా భవిష్యత్ లో కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా ఉపయోగపడుతుంది.
ఉద్దానం కిడ్నీ బాధితులను...
అనంతరం ఆయన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం పలాసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇండ్రస్ట్రియల్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరించారు.