Chandrababu : నేడు సిక్కోలు కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు

Update: 2025-04-26 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మమత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నేడు అమలు చేయనున్నారు. మత్స్యకార భృతిని పంపిణీ చేయనున్నారు.

ఎచ్చర్ల నియోజకవర్గంలో...
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్దిదారులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరంప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మొత్తం 1.29,178 మంది మత్స్యకారులు ఈ ఇరవై వేల రూపాయలు లబ్ది పొందనున్నారు.


Tags:    

Similar News