Davos : దావోస్ లో్ నేడు చంద్రబాబు రెండో రోజు పర్యటన
దావోస్ లో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది.
దావోస్ లో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న భారత్ కు చెందిన పారిశ్రామికవేత్తలలో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు నేడు దావోస్ లో ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
వివిధ సంస్థల సీఈవోలతో...
సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చల్లో పాల్గొననున్నారు. అలాగే వివిధ సంస్థలకు చెందిన సీఈవోలతోనూ, ఛైర్మన్ లతోనూ సమావేశమై చర్చిస్తారు. యూఏసీ ఎకనమీ మంత్రి బిన్ తో కూడా సమావేశమై చంద్రబాబు చర్చించనున్నారు. వీలయినన్ని ఎక్కువ పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన సాగుతుంది.