Chandrababu : నేడు నంద్యాల జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు. జలహారతిని చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇందుకోసం నేడు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు.
రైతులతో ముఖాముఖి...
మల్కాల ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదల కార్యక్రమం అనంతరం చంద్రబాబు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.