Chandrababu : నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు

Update: 2025-01-19 02:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి ఢిల్ీ నుంచి బయలుదేరి దావోస్ కు చేరుకోనున్నారు. ఆయన వరల్ట్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తో పాటు ఉన్నతాధికారులు కూడా దావోస్ బయలుదేరి వెళ్లనున్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా...
రాష్ట్రంలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. తనకున్న పాత పరిచయాలతో ఏపీకి ఎక్కువ పరిశ్రమలు తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. అమరావతి, విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజింటేషన్ కూడా ఇవ్వనున్నారు.


Tags:    

Similar News