Chandrababu : నా కలలు నిజం అవుతాయన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు రెండో రోజు దావోస్ లో పర్యటిస్తున్నారు

Update: 2025-01-21 07:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు రెండో రోజు దావోస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడారు. అందరినీ చూస్తుంటే తనలో నమ్మకం పెరిగిందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ లో తన కలలు నిజమవుతాయని ఆయన అన్నారు. రెండున్నర దశాబ్దాల్లోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ ను భారత్ లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా అభివృద్ధి చేశామన్న చంద్రబాబు కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా హైదరాబాద్ లో అన్ని రంగాలను అభివృద్ధి చేశామని తెలిపారు.

రాయితీలు...
2047 నాటికి భారత్ ప్రపంచంలోనే మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తుందని తెలిపారు. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారన్న చంద్రబాబు ఇరవై ఐదేళ్ల క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెన్ ను తీసుకు వచ్చారన్నారు. రానున్న కాలంలో ఏపీలోనూ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని, అందుకు తగిన ప్రోత్సహకాలను ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏపీకి వచ్చే కంపెనీలకు తమ కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తుందని ప్రకటించారు. అవసరమైన రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తాను క్రమం తప్పకుండా దావోస్ సదస్సుకు వచ్చి అనేక విషయాలను తెలుసుకుంటున్నానని తెలిపారు.


Tags:    

Similar News