Chandrababu : వారందరికీ నెలకు నాలుగు వేలు.. త్వరలో గుడ్ న్యూస్
Chandrababu : వారందరికీ నెలకు నాలుగు వేలు.. త్వరలో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల నెలకు పెన్షన్ అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు చేయాలని, మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది.
యాభై ఏళ్లు నిండిన...
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం తర్వాత ఈ పెన్షన్ మంజూరు చేయనున్నారని అధికార వర్గాలు తెలిపారు.