Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను చర్చించి ఆమోదించనున్నారు.

Update: 2025-08-21 02:19 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను చర్చించి ఆమోదించనున్నారు. ఇటీవల సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో నిర్ణయించిన ప్రతిపాదనలకు మంత్రి వర్గ సమావేశం నేడు ఆమోదం తెలిపే అవకాశముంది. అనేక సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అవకాశముంది.

కీలక అంశాలపై...
దీంతో పాటు జిల్లాల పునర్విభజనపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాల పేర్ల మార్పులపై కూడా చర్చించి వాటికి ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు పీ4 అంశంపైనా కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. దీంతో పాటు ఇటీవల ప్రవేశేపెట్టిన ఉచిత బస్సు పధకంపై కూడా ఫీడ్ బ్యాక్ ను మంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. మంత్రి వర్గ సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News