Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Update: 2025-05-20 02:21 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశంలో వచ్చే నెల 12వ తేదీనాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది అవుతుంది. ఏడాది పాలనపై ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.

చర్చించే అంశాలివీ...
దీంతో పాటు ఏడాది కాలం పూర్తి కావడంతో ఉద్యోగుల బదిలీలు, భూకేటాయింపులు, అమరావతి పునర్మిర్మాన పనులు, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపైమంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ మొదటి వారంలో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు దీనికిసంబంధించి సమావేశంలో ప్రకటన చేసే అవకాశముంది. దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకంతో పాటు ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానున్న మహిళలకు ఉచిత బస్సు పథకంంపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News