Andhra Pradesh : 15న ఏపీ కేబినెట్ భేటీ
ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది.
రేపు నూజివీడుకు...
మంత్రివర్గ సమావేశంలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. మరోవైపు రేపు నూజివీడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆగిరిపల్లిలో పూలే జయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. వడ్లమానులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.