Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

Update: 2025-06-04 02:46 GMT

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం11 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ జరగనుంది.అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లపై చర్చించి ఆమోదించనున్నారు.

రాజధాని అంశాలపై చర్చ...
అలాగే హెచ్‌వోడీ 4 టవర్ల టెండర్లకు ఆమోదంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రెండోదశలో 44 వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై కూడా చర్చ జరగనుంది. అమరావతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు నిర్మాణానికి ఆమోదం కేబినెట్ తెలపనుంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణంతో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదంపై చర్చ.. తల్లికి వందనం నిధుల విడుదలపై చర్చిస్తారు. కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.


Tags:    

Similar News